ఢిల్లీలో ఇసుక తుఫాన్, పిడుగులతో కూడిన వర్షం: IMD రెడ్ అలర్ట్
ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం ఇసుక తుఫాన్, పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో IMD రాజధానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది.
పాలెం ఏరియాలో గంటకు 93 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. దట్టమైన దుమ్ము, దూళి కారణంగా విజిబిలిటీ పూర్తిగా పడిపోవడంతో మధ్యాహ్నమే వాహనదారులు హెడ్ లైట్లు ఆన్ చేసుకోవాల్సి వచ్చింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు ప్రవహించడంతో ట్రాఫిక్ స్తంభించింది.
నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్ ప్రాంతాలు కూడా ఇసుక తుఫాన్ లో చిక్కుకున్నాయి. రాజస్థాన్ లోని చురు ప్రాంతంలోనూ ఇసుక తుఫాన్ కారణంగా చీకటి ఏర్పడింది. ఉత్తరప్రదేశ్ లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడి ఉష్ణోగ్రతలు తగ్గాయి.
రానున్న కొన్ని గంటల్లో వాతావరణం మరింత క్షీణించే ప్రమాదం ఉందని IMD హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించింది. ఢిల్లీ పరిసర ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com