బంగ్లాదేశ్‌లో హై కమిషనర్‌కు క్యాబినెట్ మంత్రి హోదా కల్పించిన కేంద్రం
భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ లో భారత హై కమిషనర్ గా నియమితులైన దినేష్ త్రివేదికి క్యాబినెట్ మంత్రి స్థాయి హోదా కల్పించింది. ఇది వ్యక్తిగత గౌరవార్థం మాత్రమే. కేవలం లాంఛన ప్రాయమైన కార్యక్రమాలకే ఈ హోదా పరిమితం. దీని వలన అధికార ప్రాధాన్యత పట్టికలో ఎటువంటి మార్పు ఉండదు.
దౌత్యాధికారులకు క్యాబినెట్ హోదా ఇవ్వడం చాలా అరుదు. గతంలో 1992 నుంచి 1996 వరకు వాషింగ్టన్ లో భారత రాయబారిగా పనిచేసిన సిద్ధార్థ శంకర్ రేకు కూడా అప్పటి ప్రభుత్వం క్యాబినెట్ హోదా కల్పించింది. ఆ తర్వాత ఇప్పటికి దినేష్ త్రివేదికి ఆ అవకాశం దక్కింది.
పశ్చిమ బెంగాల్ కు చెందిన 76 ఏళ్ల దినేష్ త్రివేది గత యూపీఏ ప్రభుత్వంలో రైల్వే, ఆరోగ్య శాఖల మంత్రిగా పనిచేశారు. ఆయన గతంలో తృణమూల్ కాంగ్రెస్ లో సుదీర్ఘ కాలం పనిచేసి, 2021 ఫిబ్రవరి లో బీజేపీలో చేరారు. ఈ ఏడాది ఏప్రిల్ 27 న ఆయన బంగ్లాదేశ్ లో భారత హై కమిషనర్ గా నియమితులయ్యారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com