ఇండియన్ రైల్వే AC కోచుల నుండి 1.27 కోట్ల లినెన్ వస్తువులు చోరీ
దేశవ్యాప్తంగా ఇండియన్ రైల్వే AC కోచ్ల నుండి గత నాలుగేళ్లలో 1 కోటి 27 లక్షల లినెన్ వస్తువులు చోరీకి గురయ్యాయి. 2022 జనవరి నుండి 2026 మే వరకు జరిగిన ఈ చోరీల వివరాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి.
ఈ లినెన్ చోరీల్లో అత్యధికంగా 46 లక్షల 54 వేల ఫేస్ టవల్స్ మాయమయ్యాయి. తర్వాత స్థానాల్లో 41 లక్షల 30 వేల బెడ్ షీట్లు, 23 లక్షల 59 వేల పిల్లో కవర్లు చోరీ అయ్యాయి. అలాగే 12 లక్షల 95 వేల దుప్పట్లు, 2 లక్షల 76 వేల దిండ్లు కూడా కనిపించకుండా పోయాయి.
2022తో పోలిస్తే 2025 నాటికి AC కోచ్ల లినెన్ చోరీ రేటు 56 శాతం పెరిగిందని డేటా చెప్తోంది. మొత్తం చోరీల సంఖ్య 2025లో భారీగా పెరిగినట్టు సమాచారం.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com