అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం: సైకత శిల్పంతో ‘డ్రగ్స్ వద్దు సోదరా’ సందేశం
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం (జూన్ 26) సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా రంగంపేటకు చెందిన సోహిత ధన్యత అనే మహిళ సైకత శిల్పాన్ని రూపొందించారు. ‘డ్రగ్స్ వద్దు సోదరా’ అనే నినాదంతో ఈ శిల్పం రూపొందించారు.
గత ఆరు సంవత్సరాలుగా వివిధ జాతీయ, అంతర్జాతీయ దినోత్సవాలకు సైకత శిల్పాల ద్వారా ప్రజలను చైతన్యం చేయడానికి తాను కృషి చేస్తున్నట్లు సోహిత ధన్యత తెలిపారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తు నిర్మించుకోవాలనే ఉద్దేశంతో ఈ శిల్పం రూపొందించినట్లు వివరించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com