జ్ఞానేశ్వరి మిస్సింగ్: ప్రణాళికాబద్ధ కిడ్నాప్ కాదు, జంతువుల దాడి కోణంలో దర్యాప్తు
జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ఎస్పీ బిందుమాధవ్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. ప్రణాళికాబద్ధమైన కిడ్నాప్ చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు. చిన్నారిని ఒంటరిగా నడిచివెళ్లడం ప్రత్యక్ష సాక్షులు చూశారు. ఎవరైనా వ్యక్తులు తీసుకెళ్లిన అవకాశాన్ని తోసిపుచ్చారు.
సీసీ ఫుటేజీ, ఐపీడీఆర్, కవర్ డంపుల అనాలిసిస్ సమాంతరంగా కొనసాగుతోంది. అడవి జంతువుల కోణంలో కూడా దర్యాప్తు ముమ్మరం చేసినట్టు తెలిపారు. అడవి జంతువులు చిన్న పాపను లాక్కెళ్లే ప్రమాదం ఉందని, అందుకే ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ సాయం తీసుకుంటున్నామన్నారు.
డ్రోన్ సెర్చ్ కొనసాగుతోంది, ఆరు పాయింట్లను గుర్తించామన్నారు. అయితే ఇప్పటివరకు టెక్నికల్ అనాలిసిస్లో ఎలాంటి అనుమానాస్పద అంశాలు బయటపడలేదు. జంతువుల కోణంలోనూ ఆధారాలు లభించలేదు. ఘటన కేవలం 30 నిమిషాల వ్యవధిలో జరిగిందని, ప్రణాళికాబద్ధంగా ఉండే అవకాశం తక్కువని ఎస్పీ అన్నారు.
వర్షం కారణంగా గ్రావెల్ రోల్ అయ్యే అవకాశముంది. కేసు నమోదు చేసిన నిమిషం నుంచి నిరంతరం గాలింపు చర్యలు సాగిస్తున్నామని, ఆహారం లేక చిన్నారి బాధపడకూడదని నిరంతరం ప్రయత్నిస్తున్నామన్నారు. కేసులో కుక్క సాయం కూడా తీసుకుంటున్నట్టు తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com