నిర్మల్‌లో కడెం ప్రాజెక్టుకు భారీ వరద; ఆరు గేట్లు ఎత్తివేత
నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీ వరద ప్రవాహం వచ్చి చేరింది. భారత వర్షపాతం కారణంగా ప్రాజెక్టు లోకి 21,040 క్యూసెక్కుల నీరు చేరింది. నీటిమట్టం 700 అడుగుల పూర్తి సామర్థ్యానికి 691 అడుగులకు చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 1.867 టీఎంసీల నీరు నిలువ ఉంది.
భారీగా వరద వస్తుండడంతో అధికారులు ఆరు గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. దిగువన ఉన్న నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు, రైతులు, మత్యకారులు, గొర్రెల కాపర్లకు అలర్ట్ జారీ చేశారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
వరద నీటి విడుదలతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com