హైదరాబాద్ 29°C
అమరావతి 34°C
IST 2:29 PM
ఆదివారం జూలై 26 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆంధ్రప్రదేశ్

మిషన్ శక్తి శాట్‌కు ధవళేశ్వరం విద్యార్థిని కందుల జెస్సీ ఎంపిక

రచన: ఉషా కిరణం డెస్క్ ·
మిషన్ శక్తి శాట్‌కు ధవళేశ్వరం విద్యార్థిని కందుల జెస్సీ ఎంపిక
📷 Andy Barbour / Pexels
షేర్ కాపీ అయింది ✓

అంతరిక్ష విజ్ఞాన రంగంలో బాలికలను ప్రోత్సహించే 'మిషన్ శక్తి శాట్' ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ధవళేశ్వరం బాలికోన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థిని కందుల జెస్సీ ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా 21 మంది విద్యార్థినులు ఎంపిక కాగా, ఆంధ్రప్రదేశ్ నుంచి జెస్సీ ఒక్కరే ఎంపిక కావడం విశేషం.

ఈ సందర్భంగా, జెస్సీ తన తల్లిదండ్రులతో కలిసి రాజమహేంద్రవరంలోని మంత్రి కందుల దుర్గేష్ క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి దుర్గేష్ జెస్సీని శాలువాతో సత్కరించి అభినందించారు.

అనంతరం, ఆమె శాటిలైట్ రూపకల్పన కార్యక్రమంలో పాల్గొనేందుకు అవసరమైన విమాన టికెట్లు, వసతి సదుపాయాలు, ఒక స్మార్ట్‌ఫోన్‌ను ఉచితంగా అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. జెస్సీ విజయం పలువురికి స్ఫూర్తిగా నిలుస్తుందని ఆయన అన్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com