TRTU లోగోను ఆవిష్కరించిన బీఆర్ఎస్ నేత కవిత; ప్రభుత్వ ఉద్యోగాలన్నీ పర్మినెంట్ చేస్తామని ప్రకటన
హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో టీఆర్ఎస్ కార్యాలయంలో బీఆర్ఎస్ నేత కవిత TRTU (తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్) లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
తెలంగాణ రక్షణ సేన నుండి TRTU ఏర్పాటు చేసినట్టు కవిత తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త లేబర్ చట్టాలు దేశంలో కార్మికుల హక్కులను హరించే కుట్ర అని ఆరోపించారు. అధికార పార్టీలు, రాజకీయ దురందరులు కార్మికులను దోచుకుంటున్నారని విమర్శించారు.
బీఆర్ఎస్ ఒక లేబర్ ఫ్రెండ్లీ పార్టీ అని, రాష్ట్రంలోని కోటిన్నర మంది కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం TRTU పోరాడుతుందని తెలిపారు.
ప్రపంచంలో చాలా దేశాల్లో వృద్ధాప్య జనాభా కారణంగా యువశక్తి కొరత ఉందని, అయితే భారత్‌లో యువత ఉన్నా వారికి చదువుకు తగ్గ ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నామని చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలన్నీ పర్మినెంట్ చేస్తామని, అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ విధానాలు రద్దు చేస్తామని కవిత హామీ ఇచ్చారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలకు ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు.
ప్రభుత్వం ప్రజలకు, ప్రైవేట్ సంస్థలకు మార్గదర్శకంగా ఉండాలి కానీ దోపిడీ చేయకూడదని ఆమె అన్నారు. ప్రభుత్వం యాజమాన్యంగా పనులు చేయించేటప్పుడు ఉద్యోగులకు భద్రత కల్పించాలని, వారి ప్రశాంతత దెబ్బతినకూడదని కవిత అభిప్రాయపడ్డారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com