వార్తలు

ఖైరతాబాద్ బడా గణేష్ నిర్మాణం ప్రారంభం: పంచముఖ సంకటహర మహాగణపతిగా దర్శనం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
ఖైరతాబాద్ బడా గణేష్ నిర్మాణం ప్రారంభం: పంచముఖ సంకటహర మహాగణపతిగా దర్శనం
📷 Abhishek Yadav / Pexels
షేర్ కాపీ అయింది ✓

హైదరాబాద్ లోని ఖైరతాబాద్ బడా గణేష్ నిర్మాణానికి ఏకాదశి సందర్భంగా కర్ర పూజ నిర్వహించారు నిర్వాహకులు. ఈ సందర్భంగా బడా గణేష్ పోస్టర్ లాంచ్ కూడా చేశారు. ఈ సంవత్సరం 68 నుంచి 70 అడుగుల పంచముఖ సంకటహర మహాగణపతిగా విగ్రహాన్ని రూపొందించనున్నారు. ఐదు తలలతో కూడిన పంచముఖ గణపతితో పాటు సోమనాథ్ జ్యోతిర్లింగం, కాళికా మాత మూర్తులను కూడా ప్రతిష్టించనున్నారని ఖైరతాబాద్ ఉత్సవ సమితి తెలిపింది. సెప్టెంబర్ 14 నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని నిర్వాహకులు వెల్లడించారు. మట్టి గణపతి నిర్మాణానికి ఒరిస్సా నుంచి మట్టి తెప్పిస్తారు. కర్రలు ఆంధ్రా నుంచి తెప్పించనున్నారు. మచిలీపట్నం నుంచి వెల్డర్లు వస్తారు. 150 నుంచి 200 మంది వర్కర్లు పనిచేస్తారు. డబల్ లేయర్ స్టీల్ ఫ్రేమ్ వాడతారని శిల్పి తెలిపారు. 80 రోజుల్లోనే పని పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.

హైదరాబాద్ జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR ప్రక్రియ ప్రారంభమైంది. 15 నియోజకవర్గాల పరిధిలో 4062 పోలింగ్ స్టేషన్లలో ఈ ప్రక్రియ చేపట్టారు. బూతు స్థాయి అధికారులు BLO లు ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తున్నారు. జూలై 1 వరకు ఫారాల పంపిణీ జరుగుతుంది. జూలై 24 వరకు పూర్తి చేసిన ఫారాలను సేకరిస్తారు. హిమాయత్ నగర్ లో ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఓటు హక్కు కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపిచ్చారు. GHMC కమిషనర్ RV కర్ణన్ ఫిలిం నగర్ లో ప్రక్రియను పరిశీలించారు.

గ్రేటర్ హైదరాబాద్ లో మరో నాలుగు చెరువులు అభివృద్ధి చేయనున్నారు HYDRA అధికారులు. ఇబ్రహీం బాగ్ పెద్ద చెరువు 97 ఎకరాలు, భగీరథమ్మ చెరువు 54 ఎకరాలు, కాముని చెరువు 48 ఎకరాలు, కాప్ర చెరువు 112 ఎకరాలలో పునరుద్ధరణ చేపట్టారు. ఈ నాలుగు చెరువుల అభివృద్ధికి 107 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు.

హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో పార్కింగ్ సదుపాయాల కొరత, ఉచిత టాయిలెట్లు లేకపోవడం, టికెట్ ధరలు అధికంగా ఉండటంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళా కోచుల్లో పురుషులు ప్రవేశిస్తున్నారని అధికారులు చర్యలు తీసుకోవాలని మహిళలు కోరుతున్నారు. విద్యార్థులకు నెలవారి పాసులపై రాయితీ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

కూకట్పల్లిలోని జొమాటో గోడౌన్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. గడువు ముగిసిన మసాలా పదార్థాలు, పిజ్జా సాస్ పారవేయించారు. వెజ్ నాన్ వెజ్ పదార్థాలు కలిపి ఉంచడంపై అభ్యంతరం తెలిపారు. సంస్థకు నోటీసులు జారీ చేశారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com