హైదరాబాద్ 24°C
అమరావతి 27°C
IST 1:51 AM
మంగళవారం ఆగస్టు 25 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్

నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో పాలిమర్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో పాలిమర్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం
📷 cottonbro studio / Pexels
షేర్ కాపీ అయింది ✓

నంద్యాల జిల్లా కోవెలకుంట్లలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర పాలిమర్ ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఈ ఫ్యాక్టరీలో సుమారు 200 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ప్రమాదంలో నాలుగు భారీ యంత్రాలు పూర్తిగా కాలిపోయాయి. రెండు ఆటోమేటిక్ ఆన్లైన్ ప్రింటింగ్ మిషన్లు, రెండు మాన్యువల్ ప్రింటింగ్ మిషన్లు, ఎయిర్ కంప్రెసర్లు, విడిభాగాలు ధ్వంసమయ్యాయి.

పైకప్పు, సోలార్ ప్యానెళ్లు కూడా దెబ్బతిన్నాయి. బాధితుడు సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ సుమారు రూ.3 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు తెలిపారు.

సమాచారం అందుకున్న బనగానపల్లి అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కోవెలకుంట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ హనుమంతు నాయక్, ఎస్ఐ మల్లికార్జున్ రెడ్డి దర్యాప్తు చేపట్టారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com