కృష్ణా జిల్లాలో NREGA రోడ్డు నాలుగు నెలల్లోనే బీటలు; మరమ్మతులకు గ్రామస్థుల విజ్ఞప్తి
కృష్ణా జిల్లా ఘంటసాల మండలం పుషడం మల్లం, చిట్టూర్పు గ్రామాలను కలిపే NREGA రోడ్డు వేసిన నాలుగు నెలల్లోపే బీటలు వారింది. 2025 ఫిబ్రవరిలో 2.40 కోట్ల వ్యయంతో ఈ రోడ్డు నిర్మించారు.
భారీ వాహనాలు తిరగకపోయినా, నాలుగు నెలలకే రోడ్డుపై పగుళ్లు కనిపించాయని గ్రామస్థులు చెబుతున్నారు. వర్షాకాలం ముందు ఈ పరిస్థితి ఉంటే, భవిష్యత్తులో రోడ్డు పూర్తిగా పాడైపోవచ్చునని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ రోడ్డు ఎమ్మెల్యే చొరవతో వేయించినప్పటికీ, కాంట్రాక్టర్ నాణ్యత లేకుండా నిర్మించాడని వారు ఆరోపించారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com