లాల్ దర్వాజా బోనాల ఉత్సవాల్లో కేటీఆర్ పాల్గొన్నారు
హైదరాబాద్ లాల్ దర్వాజాలో జరిగిన బోనాల ఉత్సవాల్లో బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కె.టి.రామారావు పాల్గొన్నారు. భక్తితో బోనం సమర్పించి, సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉండాలని, వర్షాలు బాగా పడాలని ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో వ్యాపారాలు, వాణిజ్య కార్యకలాపాలు బాగా సాగాలని పేర్కొన్నారు. ఆలయ కమిటీకి, ఆహ్వానించిన పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాజు యాదవ్, ప్రభు గౌడ్, మధు యాదవ్, విజయ్ కుమార్, వెంకటేష్, రమేష్ గౌడ్ తదితరులు ఉన్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com