హైదరాబాద్ 24°C
అమరావతి 31°C
IST 7:40 PM
బుధవారం ఆగస్టు 12 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

వికారాబాద్‌లో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొననున్నారు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
వికారాబాద్‌లో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొననున్నారు
📷 Luca Severin / Pexels
షేర్ కాపీ అయింది ✓

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ వికారాబాద్‌లో పర్యటిస్తూ, నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్నారు.

వికారాబాద్ పట్టణంలోని గౌలీకర్ నర్సింగ్ ఫంక్షన్ హాల్‌లో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంపై అవగాహన కల్పించడం, డిజిటల్ సభ్యత్వ నమోదుపై దిశానిర్దేశం చేయడం కార్యక్రమ ఉద్దేశం.

మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, సభ్యత్వ నమోదు ఇంచార్జి గట్టు రామచంద్రరావు తదితరులు ఈ సమావేశానికి హాజరవుతారు.

కేటీఆర్ ఇప్పటికే జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించి, ఎస్ఐఆర్, డిజిటల్ సభ్యత్వంపై కార్యకర్తలతో సమావేశమయ్యారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com