అన్నవరం దేవస్థానం టోల్గేట్ వద్ద మద్యం బాటిళ్లు స్వాధీనం
కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానం టోల్గేట్ వద్ద భద్రతా సిబ్బంది మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కొండపైకి కొందరు మద్యం తీసుకెళ్తున్నారని వార్తలు వచ్చాయి. దీంతో అధికారులు వాహనాల తనిఖీ చేపట్టారు.
హైదరాబాద్ నుంచి వచ్చిన భక్తులు మినీ బస్సులో కొండపైకి వెళ్తున్నారు. టోల్గేట్ దాటిన తర్వాత భద్రతా సిబ్బంది ఆ బస్సును తనిఖీ చేశారు. బస్సులో మద్యం బాటిళ్లు కనిపించాయి.
ఆ బాటిళ్లను బయటకు తీసి టోల్గేట్ వద్ద ఉన్న dustbin లో పారబోశారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com