ఆధ్యాత్మికం

అగ్నిపర్వతం అంచున వినాయకుడి విగ్రహం — ఇండోనేషియా తెంగర్ గిరిజన తెగ నమ్మకం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
అగ్నిపర్వతం అంచున వినాయకుడి విగ్రహం — ఇండోనేషియా తెంగర్ గిరిజన తెగ నమ్మకం
📷 Abhisek Tripathy / Pexels
షేర్ కాపీ అయింది ✓

ఇండోనేషియాలోని మౌంట్ బ్రోమో అగ్నిపర్వతం అంచున వినాయకుడి విగ్రహం ఉంది. సముద్ర మట్టానికి దాదాపు 2,392 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ అగ్నిపర్వతం అంచుకు కొన్ని అడుగుల దూరంలో ఈ విగ్రహం నిలిచి ఉంది.

చరిత్రకారుల పరిశోధనల ప్రకారం ఈ విగ్రహాన్ని దాదాపు 700 సంవత్సరాల క్రితం తెంగర్ అనే పురాతన గిరిజన తెగవారు ప్రతిష్టించారు. అగ్నిపర్వతం నుండి తమని రక్షించమని ఈ తెగ ప్రజలు నిరంతరం వినాయకుడికి పూజలు చేస్తారు. ప్రతిరోజు పళ్ళు, పువ్వులు, నైవేద్యాలు సమర్పించడం వారి ఆచారం.

మౌంట్ బ్రోమో అనే పేరు హిందూ సృష్టికర్త బ్రహ్మదేవుని పేరు నుండి వచ్చింది. ఇండోనేషియా Ring of Fire ప్రాంతంలో ఉంది. ఈ దేశంలో 141 అగ్నిపర్వతాలు ఉన్నాయి. అందులో 130కి పైగా active గా ఉంటాయి.

ప్రతి సంవత్సరం ఇక్కడ యాజ్ఞ కాసద పండుగ జరుగుతుంది. ఈ పండుగలో తెంగర్ తెగ ప్రజలు కొండపైకి వెళ్లి పూజలు చేస్తారు. పంటలు, మేకలు, కోళ్లు, డబ్బులను అగ్నిపర్వతం గుంతలోకి విసురుతారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com