మియాపూర్‌లో మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు
మియాపూర్‌లో వీనాయక్ రైల్వే అండర్‌పాస్ సమీపంలో ఓపెన్ మ్యాన్‌హోల్‌లో పడి ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. హఫీజ్‌పేట్ ప్రేమ్‌నగర్‌కు చెందిన హఫీజ్ (30) అని గుర్తించారు.
మరమ్మత్తుల కోసం కొన్ని రోజులుగా ఈ అండర్‌పాస్‌ను అధికారులు మూసివేశారు. అయితే మ్యాన్‌హోల్‌ను తెరిచి ఉంచడంతో ఈ ప్రమాదం జరిగింది. కాంట్రాక్టర్, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైడ్రా (HYDRA), ఈడీఆర్ (EDR) బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఇంకా గల్లంతైన వ్యక్తి ఆచూకీ లభించలేదు.
ఘటనా స్థలానికి స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com