ఖమ్మంలో SIR ప్రక్రియను పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం జిల్లా విడిఎస్ కాలనీలో జరుగుతున్న SIR సర్వే ప్రక్రియను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా పరిశీలించారు. మంత్రి క్యాంప్ ఆఫీస్ పక్కన సర్వే చేస్తున్న BLO లను పలకరించి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సామాన్య ప్రజల వద్ద ఓపికగా సర్వే నిర్వహించాలని BLO లకు సూచించారు. డాక్యుమెంట్లు అర్థమయ్యే విధంగా వివరించాలని స్పష్టం చేశారు. స్థానిక నాయకులు అవగాహన ఉన్నవారు సర్వేలో చొరవ తీసుకోవాలని కోరారు.
ఏ ఒక్క ఓటరుకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఓటు ఒకే చోట నమోదు అయి ఉండాలని, అందరికీ ఓటు హక్కు ఉండేలా చూడాలని పేర్కొన్నారు.
కుటుంబ సభ్యుల మ్యాపింగ్ విషయంలో కోడలి పేరును భర్త లేదా అత్త మామల కింద కాకుండా, ఆమె తల్లిదండ్రుల కింద నమోదు చేయాలని అధికారులకు వివరించారు. తల్లిదండ్రులు మరణించిన పక్షంలో ఆమె తండ్రి పేరు నాయనమ్మ కింద చేర్చాలని తెలిపారు. ఈ విధంగా మ్యాపింగ్ సరిగ్గా చేస్తే సర్వేలో లోపాలు రాకుండా ఉంటాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు SUDA చైర్మన్ పువ్వాల దుర్గ ప్రసాద్ పాల్గొన్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com