హైదరాబాద్ 30°C
అమరావతి 35°C
IST 3:45 PM
ఆదివారం ఆగస్టు 9 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

బోనాల వేడుకలు: మంత్రి వివేక్ హైదరాబాద్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
బోనాల వేడుకలు: మంత్రి వివేక్ హైదరాబాద్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు
📷 Balaji Srinivasan / Pexels
షేర్ కాపీ అయింది ✓

తెలంగాణ మంత్రి వివేక్, ఆయన సతీమణి సరోజ బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్ లోని పలు ప్రముఖ ఆలయాలను సందర్శించారు. వీరు కార్వాన్ ప్రాంతంలోని సబ్జీ మండి నల్లపూచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అంతకుముందు పాతబస్తి లాల్ దర్వాజాలోని ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో పట్టువస్త్రాలు సమర్పించారు. గౌలిపురం కోటమైసమ్మ, లలితాబాగ్ రేణుకెల్లమ్మ ఆలయాలను కూడా దర్శించుకున్నారు.

మంత్రి దంపతులకు ఆలయ కమిటీలు ఘన స్వాగతం పలికి సత్కరించాయి. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావం వల్ల సకాలంలో వర్షాలు కురవాలనీ, రైతులు, ప్రజలు సుఖంగా ఉండాలని ప్రార్థించినట్టు తెలిపారు.

రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలకు మంచి రోజులు రానున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారెంటీ కార్డు, సన్న బియ్యం పథకాలు, ఉద్యోగ కల్పన చర్యలు ప్రజలకు మేలు చేస్తాయని ఆయన పేర్కొన్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com