హైదరాబాద్ 24°C
అమరావతి 29°C
IST 1:02 AM
సోమవారం జూలై 20 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

హైదరాబాద్‌లో కోతుల దాడులు: విద్యానగర్‌తో సహా పలు ప్రాంతాల్లో నివాసితులు భయం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
హైదరాబాద్‌లో కోతుల దాడులు: విద్యానగర్‌తో సహా పలు ప్రాంతాల్లో నివాసితులు భయం
📷 112 Uttar Pradesh / Pexels
షేర్ కాపీ అయింది ✓

హైదరాబాద్‌లోని పలు నివాస ప్రాంతాల్లో కోతుల దాడులు పెరుగుతున్నాయి. నాగోల్, విద్యానగర్, బండ్లగూడ, సికింద్రాబాద్, ఉప్పల్ వంటి ప్రాంతాల్లో కోతుల గుంపులు సంచరిస్తున్నాయి.

ఇళ్లలోకి ప్రవేశించి వంటింట్లో ఆహార పదార్థాలు చెల్లాచెదురు చేయడం, బట్టలు, పూలకుండీలు ధ్వంసం చేయడం జరుగుతోంది. దీంతో ఇంట్లో ఒంటరిగా ఉండే మహిళలు, వృద్ధులు భయాందోళనకు గురవుతున్నారు.

రోడ్లపై కూడా దాడులు పెరిగాయి. ఒంటరిగా వెళ్తున్న వారిని వెంటాడడం, చేతిలోని సంచులు లాక్కోవడం, గోళ్లతో గీరడం వంటి ఘటనలు నమోదవుతున్నాయి. విద్యానగర్‌లో ఒక అపార్ట్‌మెంట్ నివాసిపై కోతుల గుంపు దాడి చేసింది, ఆయన చేతిని కొరకడంతో 10 కుట్లు పడ్డాయి.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రతిరోజు గుంపులుగా వస్తున్న కోతులు చిన్నపిల్లలు, వృద్ధులను టార్గెట్ చేస్తున్నాయి. అధికారులు కొన్ని ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేసినా అవి పట్టుబడట్లేదని నివాసితులు చెబుతున్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com