ముంబై, ఒడిస్సాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి; రాబోయే వారం రోజులు వానలు కొనసాగే అవకాశం
ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బాంద్రా ఈస్ట్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో రోడ్లపై నీరు నిలిచింది. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. కొన్ని చోట్ల చెట్లు కూలడంతో ట్రాఫిక్ స్థంభించింది.
పూణే, రాయగడ్, పశ్చిమ కనుమలు, లోనవాల ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. లోనవాలలో భారీ వర్షం రికార్డు స్థాయిలో నమోదైంది.
ఒడిస్సాలో కూడా వర్షం దంచికొడుతోంది. పూరి, కేంద్రపారా, బాలాసోర్, మయూర్భంజ్, జాజ్పూర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లపైకి, ఇళ్లలోకి వరద నీరు చేరింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాబోయే వారం రోజుల పాటు వానలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com