ముంబైలో భర్తను హత్య చేసి శరీర భాగాలు అడవిలో పారవేసిన భార్య, ప్రియుడు అరెస్ట్
మహారాష్ట్రలోని ముంబై ఐరోలీ ప్రాంతంలో 11 నెలల కిందటి మిస్సింగ్ కేసు కొత్త మలుపు తిరిగింది. భర్తను హత్య చేసి, శరీర భాగాలను ముక్కలు చేసి అడవిలో పారవేసిన కేసులో భార్య, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల విచారణలో నిందితురాలు సునీత కుష్వాహ తన భర్త బలిరామ్ సూర్యనాథ్ కుష్వాహను హత్య చేసినట్లు ఒప్పుకుంది. గతేడాది ఆగస్ట్ 8వ తేదీన నిద్రిస్తున్న భర్తను గొంతునులిమి చంపింది. తర్వాత ప్రియుడు రాహుల్ ప్రజాపతి సాయంతో శరీరాన్ని ముక్కలు చేసింది. తల, మొండెం, కాళ్లు వేరు చేసి గోని సంచుల్లో సర్దింది. వీటిని ఆటోలో గౌలీదేవ్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పారవేశారు.
సూర్యనాథ్ సోదరుడు తన అన్న కనిపించడం లేదంటూ కొన్ని రోజుల తర్వాత పోలీసులను ఆశ్రయించాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మొదట్లో సునీత ఇచ్చిన సమాచారం మేరకు అతడు ఉత్తరప్రదేశ్‌లోని ఆశ్రమానికి వెళ్లినట్లు భావించారు. కానీ సునీత తరచూ నివాసం మార్చడం, కాల్ డేటా పరిశీలనలో ఆమెకు రాహుల్‌తో ప్రేమ సంబంధం ఉన్నట్లు తేలింది. పోలీసులు ఆమెను కఠినంగా విచారించగా, నిందుతులు ఇద్దరూ నేరాన్ని అంగీకరించారు.
ప్రస్తుతం పోలీసులు మృతదేహ భాగాల కోసం గౌలీదేవ్ అటవీ ప్రాంతంలో గాలింపు చేస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com