హైదరాబాద్ 25°C
అమరావతి 30°C
IST 1:43 AM
ఆదివారం ఆగస్టు 16 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

నల్సార్ విద్యార్థులు బీసీఐ చైర్మన్ తీరుపై లేఖ విడుదల; క్షమాపణలు డిమాండ్

రచన: ఉషా కిరణం డెస్క్ ·
నల్సార్ విద్యార్థులు బీసీఐ చైర్మన్ తీరుపై లేఖ విడుదల; క్షమాపణలు డిమాండ్
📷 Andy Barbour / Pexels
షేర్ కాపీ అయింది ✓

హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా తీరుపై లేఖ విడుదల చేశారు.

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. తమ స్నాతకోత్సవానికి చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా ముఖ్య అతిథులుగా హాజరు కావడం ఇష్టం లేదని ఆ లేఖలో తెలిపారు.

మనన్ కుమార్ మిశ్రా వెంటనే విద్యార్థులకు, ఉపాధ్యాయులకు క్షమాపణలు చెప్పాలని కోరారు. బీసీఐ అధికారిక లెటర్ హెడ్ ఎందుకు ఉపయోగించారో వివరణ ఇవ్వాలని బీసీఐకి లేఖ రాశారు. ఈ విషయంపై బీసీఐ, మనన్ కుమార్ మిశ్రా స్పందన తెలియాల్సి ఉంది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com