ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరి ఆలయంలో చాతుర్మాస దీక్ష ప్రారంభించారు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆషాఢ శుద్ధ ఏకాదశి సందర్భంగా చాతుర్మాస దీక్ష ప్రారంభించారు.
మంగళగిరిలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఆయన దీక్షలోకి ప్రవేశించారు. సాధారణంగా ఏటా జ్యేష్ఠ మాసంలో మొదలై కార్తీక మాసంలో ముగిసే ఈ దీక్షను పవన్ కళ్యాణ్ క్రమం తప్పకుండా చేస్తున్నారు.
దీక్ష సమయంలో వీరు ఎక్కువగా చందన వర్ణ వస్త్రాలు ధరిస్తారు. నిత్యం దేవతారాధన, ధ్యానం, మంత్ర పారాయణం చేస్తారు. తెల్లవారుజామున స్నానం, బ్రహ్మచర్యం, నేలపై నిద్ర, అహింస పాటించడం ఈ దీక్షలో ముఖ్యమైన నియమాలు.
ఆహార నియమాల విషయంలో శ్రావణ మాసంలో ఆకుకూరలు, భాద్రపద మాసంలో పెరుగు, ఆశ్వయుజంలో పాలు, కార్తీకంలో పప్పు పదార్థాలు విధిగా వదిలిపెట్టాలి. పాత ఉసిరికాయ పచ్చడి మాత్రం వాడవచ్చు. రాత్రి సాత్విక శాఖాహార భోజనంతో ప్రతి రోజు దీక్ష ముగిస్తారు.
ఈ నాలుగు నెలల్లో ఒక ఉపనిషత్తు పటించడంతో పాటు భగవద్గీతలోని కొన్ని అధ్యాయాలు కంఠస్థం చేయనున్నారు. గురు ముఖత మంత్రాన్ని ఆచరించేందుకు ఈ దీక్ష ఉపకరిస్తుందని ఆయన పేర్కొన్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com