ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సహకరిస్తే కఠిన చర్యలు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఎర్రచందనం అక్రమ రవాణాకు సహకరించే వారిని ఎవరైనా ఉపేక్షించబోమని AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. స్మగ్లింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
కడప జిల్లా అవధూత కాశచినాయన మండపంలో సుమారు కోటిన్నర రూపాయల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లతో పాటు వారికి సహకరించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ను అరెస్ట్ చేసినట్లు అటవీ పోలీస్ ఉన్నతాధికారులు పవన్‌కు వివరించారు.
ఈ కేసు వెనుక బెంగళూరు, హర్యానా, కోల్‌కతా కేంద్రాలుగా పనిచేస్తున్న ప్రధాన సూత్రదారులు ఉన్నట్లు గుర్తించిన అధికారులు, వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పవన్ ఆదేశించారు. ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా నిరోధించేందుకు తీసుకున్న 'ఆపరేషన్ అరణ్య' కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా సమీక్షిస్తానని పవన్ తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com