మీన రాశి వారపు రాశిఫలం: స్థిరాస్తిలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశం
మీన రాశి వారికి ఈ వారం సోమవారం, మంగళవారం మంచి సమయం. గురువారం, శుక్రవారాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ఈ రోజుల్లో అనుకున్న పనులు ఎలాంటి ఆటంకం లేకుండా ముందుకు సాగుతాయి.
స్థిరాస్తి కోసం కేటాయించిన డబ్బు సద్వినియోగం అవుతుంది. కుజుడు షష్ఠ స్థానంలో శుభ స్థితిలో ఉన్నందున స్థిరాస్తి యోగం ఉంటుంది. ఇందులో లాభాలు వచ్చే అవకాశం ఉంది.
ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నా దాన్ని అధిగమించి పని చేస్తారు. మంచి పేరు, ప్రతిష్ట తెచ్చుకుంటారు. ప్రమోషన్లు లాభిస్తాయి. కోరుకున్న బదిలీలు రావచ్చు. కొన్ని విపత్కర పరిస్థితులను తప్పించుకుంటారు.
ఖర్చులు పెరుగుతాయి. అయినా సమయానికి డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య బాధలు తగ్గుతాయి. కుటుంబ పరంగా మానసిక బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది.
కొన్ని విషయాల్లో సందిగ్ధం, డోలాయమాన స్థితి ఉంటుంది. పిల్లల విషయంలో కొంత ఆలోచనలో పడతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అవివాహితులకు శుభవార్తలు వినిపిస్తాయి.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com