హైదరాబాద్ 29°C
అమరావతి 32°C
IST 11:05 AM
శనివారం ఆగస్టు 1 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

ప్రైవేట్ యంబులెన్స్ల మాఫియా: మృతదేహాల తరలింపుకు భారీ ఫీజు – ప్రభుత్వం కొత్త నిబంధనలు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
ప్రైవేట్ యంబులెన్స్ల మాఫియా: మృతదేహాల తరలింపుకు భారీ ఫీజు – ప్రభుత్వం కొత్త నిబంధనలు
📷 Click Jeth / Pexels
షేర్ కాపీ అయింది ✓

హైదరాబాద్ లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పోస్ట్మార్టం తర్వాత మృతదేహాలను స్వగ్రామాలకు తరలించడానికి పేద కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రైవేట్ యంబులెన్స్ నిర్వాహకులు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్, నీలోఫర్ వంటి ప్రధాన ఆస్పత్రుల్లో ఉచిత యంబులెన్స్ సేవలు ఉన్నప్పటికీ, ఆ సంఖ్య సరిపోడం లేదు.

బాధిత కుటుంబాలు తెలిపిన వివరాల ప్రకారం, ప్రైవేట్ యంబులెన్స్లు ఆస్పత్రుల చుట్టుపక్కల పార్క్ చేసి, బయటి నుంచి వాహనాలు తీసుకురాకుండా నిర్బంధిస్తున్నాయి. డెడ్ బాడీ తరలించడానికి 20,000 నుంచి 30,000 రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నారు. దీంతో, ఇప్పటికే దుఃఖంలో ఉన్న కుటుంబాలు మరింత ఇబ్బందులు పడుతున్నాయి. బాధితులు ప్రభుత్వం స్పందించి, ఉచిత యంబులెన్స్ల సంఖ్య పెంచాలని, ప్రైవేట్ వాటికి రేట్లు నిర్ణయించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ అంబులెన్స్ మాఫియాకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆస్పత్రుల నుండి మృతదేహాలను సొంత ఊర్లకు తరలించడానికి జిల్లాల వారీ ఉచిత వాహనాలు కేటాయించే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏ జిల్లా మృతదేహాన్ని ఆ జిల్లాకు కేటాయించిన వాహనంలోనే ఉచితంగా తరలించేలా కొత్త నిబంధనలు రూపొందిస్తున్నారు.

డాక్టర్లు ఈ ప్రణాళికను స్వాగతిస్తూ, ప్రతి జిల్లాకు ఒక ఉచిత వాహనం (మొత్తం 33 వాహనాలు) అవసరమని సూచించారు. ప్రభుత్వం డీజిల్, డ్రైవర్ ఖర్చులు భరిస్తుందని, అవసరమైతే పారామెడికల్ సిబ్బందిని కూడా పంపుతుందని తెలిపారు. ఈ విధానం అమలైతే ప్రైవేట్ మాఫియా దోపిడీకి అడ్డుకట్ట పడుతుందని బాధితులు ఆశిస్తున్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com