మధ్యప్రదేశ్‌లో 12 సంస్థానాల రాజుల అరుదైన ఛాయాచిత్రం బయటపడింది
మధ్యప్రదేశ్‌లో 12 సంస్థానాల పాలకుల అరుదైన ఛాయాచిత్రం బయటపడింది. 1860-1875 మధ్య కాలానికి చెందిన ఈ ఫోటో ఫ్రేమ్‌లో హైదరాబాద్ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్, బరోడా గైక్వాడ్ పాలకుడు మహారాజ నయాజీరావు, మైసూరు మహారాజ చామరాజేంద్ర వడియార్ తదితర 12 మంది రాజుల చిత్రాలు ఉన్నాయి.
పురావస్తు శాఖాధికారులు వీరిలో తొమ్మిది మందిని గుర్తించారు. మిగిలిన మూడు చిత్రాల వివరాలు తెలియాల్సి ఉంది.
స్థానిక నివాసి రాధావల్లభ్ తెలిపిన వివరాల ప్రకారం, 50 ఏళ్ల క్రితం ఓ వ్యక్తి ఈ ఫోటోను ఫ్రేమ్ కోసం దుకాణదారుడికి ఇచ్చి వెళ్లాడు. ఆ తర్వాత దాన్ని తీసుకోలేదు. ఈ అరుదైన ఫోటో ఫ్రేమ్‌ను గుర్తించగా, దుకాణదారుడు రాధావల్లభ్‌కు ఉచితంగా ఇచ్చారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com