మూసీ నది ఒడ్డున ఉన్న ఉచిత పాఠశాల భవనాన్ని అధికారులు కూల్చివేశారు
హైదరాబాద్ నార్సింగిలో మూసీ నది పరివాహక ప్రాంతంలో నిర్మించిన ఓ ఉచిత పాఠశాల భవనాన్ని గండిపేట రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. పోలీసు భద్రత మధ్య కూల్చివేత చేపట్టారు.
నదీ తీరంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. 'ది బాంబిని క్రీక్' అనే ఈ స్కూల్‌లో సుమారు 250 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
స్కూల్ నిర్వాహకులు మాత్రం ఈ చర్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు జూలై 3 వరకు గడువు ఇచ్చినప్పటికీ, గడువు ముగియకముందే, రాత్రి సమయంలో అధికారులు అనుమతి లేకుండా ప్రవేశించి కూల్చివేశారని ఆరోపించారు. తమ వద్ద అవసరమైన ఒప్పందాలు, డాక్యుమెంటేషన్ ఉన్నాయని, పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోకుండా ఈ చర్య తీసుకున్నారని నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిలాష అనే అధికారి గత పది రోజులుగా ఈ స్థలాన్ని తమకివ్వాలని బెదిరిస్తున్నారని కూడా ఆరోపించారు.
ఈ విషయంపై రెవెన్యూ అధికారుల స్పందన తెలియాల్సి ఉంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com