విజిలెన్స్ దాడులు నిలిపివేయాలి: రాష్ట్ర రైస్ మిల్లర్ల డిమాండ్
రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లర్లపై జరుగుతున్న విజిలెన్స్ దాడులను వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని కోరింది.
అసోసియేషన్ అధ్యక్షుడు పాడి గణపతి రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వ విధానాలు, పాత నిబంధనల కారణంగా రైస్ మిల్లర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పలువురు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, మరికొందరు గుండెపోటుతో మృతి చెందుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసులు, విజిలెన్స్ అధికారులు మిల్లర్లను భయపెట్టకుండా, ఆగస్టు 15 లోపు మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించాలని అసోసియేషన్ కోరింది.
రాష్ట్రంలో డిఫాల్ట్ రైస్ మిల్లర్లున్నవారికి నాలుగు విడతలుగా చెల్లింపులు చేయాలని, ప్రభుత్వం 21 రూపాయల కింటాల్ బఫర్ స్టాక్ టెండర్ రేటు ప్రకారం ఆర్థిక సాయం అందించి వారి జీవనోపాధిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com