హైదరాబాద్ 23°C
అమరావతి 26°C
IST 2:14 AM
శనివారం ఆగస్టు 8 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

జాతీయ చేనేత దినోత్సవం: నెక్లెస్ రోడ్‌లో ఎగ్జిబిషన్ ప్రారంభించిన మంత్రి సీతక్క

రచన: ఉషా కిరణం డెస్క్ ·
జాతీయ చేనేత దినోత్సవం: నెక్లెస్ రోడ్‌లో ఎగ్జిబిషన్ ప్రారంభించిన మంత్రి సీతక్క
📷 Sumit K Sharma / Pexels
షేర్ కాపీ అయింది ✓

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన చేనేత ఎగ్జిబిషన్‌ని రాష్ట్ర మంత్రి సీతక్క ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవసాయం తర్వాత అత్యంత కష్టపడేది నేత కార్మికులేనని చెప్పారు. నేత రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆధ్వర్యంలో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్టు వివరించారు.

వారానికి కనీసం రెండు రోజులైనా చేనేత వస్త్రాలు ధరించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com