నల్గొండలో శ్రీ సీతారామ ఆలయం 40 ఏళ్ల తర్వాత పునర్నిర్మాణం, విగ్రహ ప్రతిష్ఠ
నల్గొండ జిల్లా శాలిగౌరవరం మండలం మణిమొద్ద గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం పునర్నిర్మాణం పూర్తి చేసి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం మూడు రోజుల పాటు నిర్వహించారు.
ఈ ఆలయం గత 40 సంవత్సరాలుగా నిత్యపూజలకు దూరమై శిథిలావస్థకు చేరుకుంది. దీన్ని పునరుద్ధరించేందుకు దాతలు ముందుకు వచ్చారు. ఈ నెల 17న గోపూజ, గ్రామోత్సవం ప్రారంభించి, 18న హోమం, 19న వేదపండితుల చేత విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.
పెరుమాళ్ళ మూలమ్మ రాములు గారి కుమారులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, గ్రామం పట్ల ఉన్న అభిమానంతో ఈ ఆలయ పునర్నిర్మాణానికి ముందుకు వచ్చారు. గ్రామ పెద్దలు, గ్రామస్తుల సహకారంతో శిథిలమైన పాత ఆలయాన్ని తొలగించి వేరే స్థలంలో విగ్రహ ప్రతిష్ట చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com