హైదరాబాద్ 29°C
అమరావతి 33°C
IST 11:47 AM
ఆదివారం ఆగస్టు 16 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

ఇబ్రహీంపట్నంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
ఇబ్రహీంపట్నంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
📷 Satya Nandigam / Pexels
షేర్ కాపీ అయింది ✓

తెలంగాణ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రమిదా కన్వెన్షన్‌లో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అందజేశారు.

నిత్యవసర సరుకులను ప్రజలకు పారదర్శకంగా, సులభంగా అందించడంతో పాటు ప్రజా పంపిణీ వ్యవస్థను ఆధునిక సాంకేతికతతో పటిష్టం చేయడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు.

ప్రతి స్మార్ట్ కార్డులో QR కోడ్ ఉంటుంది. ఆధార్ ఆధారంగా ఈ కార్డును T-Ration app తో అనుసంధానించారు. లబ్ధిదారులు తమ స్మార్ట్ ఫోన్ ద్వారా రేషన్ వివరాలు చూసుకోవచ్చు.

ఏ నెలలో ఎంత రేషన్ తీసుకున్నారు, కుటుంబ సభ్యుల్లో ఎవరు తీసుకున్నారు వంటి వివరాలు డిజిటల్‌గా నమోదవుతాయి. దీనివల్ల పంపిణీ ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com