శ్రీకాకుళంలో వరద ఉధృతి.. మునిగిన రోడ్లు, కాలనీలు
శ్రీకాకుళం జిల్లాలో వరద పరిస్థితి కొనసాగుతోంది. టెక్కలి-నౌపడ రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
బహుదా నది ఉదృతి కారణంగా ఇచ్చాపురం సమీపంలో హైవేపైకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. పలాస మండలం లక్ష్మీపురం టోల్ ప్లాజా వద్ద లారీలను నిలిపివేశారు. లక్ష్మీపురం టోల్ ప్లాజా నుంచి నందిగం మండలం సుభద్రాపురం వరకు లారీలు నిలిచిపోయాయి.
సంతబొమ్మాళి మండలం నవవుడ సమీపంలోని మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ నిర్వాసిత కాలనీలను వరద చుట్టుముట్టింది. మూలపేట విష్ణు చక్రం నిర్వాసిత కాలనీలో ఇళ్లలోకి నీరు చేరింది. నివాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రాంతవాసుల కథనం ప్రకారం, సరైన డ్రైనేజీ లేకపోవడంతో నీరు బయటకు వెళ్లలేకపోతోంది. పోర్ట్ రోడ్డు నిర్మాణం వరద నీటికి అడ్డుగా మారిందని వారు చెప్తున్నారు. మూడు రోజులుగా నీరు నిలిచి ఉండడంతో జ్వరం, ఇతర అనారోగ్యాలు తలెత్తుతున్నాయని తెలిపారు. రాత్రుళ్లు పాములు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
తమకు తాక్షణిక సహాయం అందించాలని నివాసులు కోరుతున్నారు. ఊరు చుట్టూ వాలు కట్టడంతో పాటు తగిన చర్యలు చేపట్టాలని కోరారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com