హైదరాబాద్ 28°C
అమరావతి 32°C
IST 10:34 AM
శనివారం ఆగస్టు 8 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

శ్రీశైలం ప్రాజెక్టు వేగంగా నిండుతోంది, నాగార్జున సాగర్‌లో నిల్వలు తక్కువ

రచన: ఉషా కిరణం డెస్క్ ·
శ్రీశైలం ప్రాజెక్టు వేగంగా నిండుతోంది, నాగార్జున సాగర్‌లో నిల్వలు తక్కువ
📷 https://www.youtube.com/@mangonews / Wikimedia Commons / cc-by
షేర్ కాపీ అయింది ✓

శ్రీశైలం ప్రాజెక్టు వేగంగా నిండుతంది, నాగార్జున సాగర్ లో నిల్వలు మాత్రం తక్కువగా ఉన్నాయి. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో కృష్ణా నదికి వరద ప్రవాహం పెరిగింది.

జూరాల ప్రాజెక్టు కేవలం రెండు రోజుల్లో దాదాపు నిండింది. జూలై 30 న తొలిసారి 10 గేట్లు తెరిచారు. ఆ తరువాత వరద పెరగడంతో మరిన్ని గేట్లు ఎత్తారు. ప్రస్తుతం జూరాల నుంచి 32 గేట్ల ద్వారా 2.5 లక్షల క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది.

ఈ వరద శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతోంది. 215 టీఎంసీల సామర్థ్యం గల శ్రీశైలంలో ఏప్రిల్ నాటికి కేవలం 43 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఒక వారంలో 100 టీఎంసీలకు పైగా నీరు వచ్చి చేరింది. ఇప్పుడు నిల్వలు 170 టీఎంసీలకు చేరాయి. ప్రస్తుతం 2 లక్షల క్యూసెక్కుల చొప్పున నీరు వస్తుండటంతో మరో 3-4 రోజుల్లో ప్రాజెక్టు పూర్తిగా నిండి, గేట్లు తెరిచే అవకాశం ఉంది.

కృష్ణా నది నీటి వాటాల పంపిణీపై కేఆర్ఎంబి (KRMB) ఆగష్టు 13న హైదరాబాద్ లో సమావేశం కానుంది. ఏపీ, తెలంగాణ ఈఎన్సిలు, ఉన్నతాధికారులు హాజరవుతారు.

నాగార్జున సాగర్ ప్రాజెక్టు 312 టీఎంసీల సామర్థ్యం ఉన్నా, ప్రస్తుతం కేవలం 138 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. శ్రీశైలం గేట్లు తెరుచుకుని 10 రోజులపాటు వరద కొనసాగితే తప్ప సాగర్ నిండే అవకాశం లేదు.

తెలంగాణ ప్రభుత్వం వరుణ యాగం నిర్వహించనుంది. ఆగష్టు 10న విజయ విహార్ ప్రాంగణంలో 108 మంది వేద పండితులు, 11 హోమగుండాలతో యాగం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొంటారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com