శ్రీశైలం జలాశయానికి భారీ వరద ప్రవాహం : నీటి మట్టం 863 అడుగులకు
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 2,45,183 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. ఆల్మట్టి, నారాయణపూర్ వంటి ఎగువ ప్రాంతాల నుంచి కూడా వరద నీరు వస్తోంది.
ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 863.90 అడుగుల వద్ద ఉంది. జలాశయం పూర్తి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా, ఇప్పటివరకు 118.6 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రతిరోజు 20 టీఎంసీలకు పైగా నీరు చేరుతోందని అధికారులు తెలిపారు.
ఇంకా సిల్వే గేట్లు ఎత్తలేదు, విద్యుత్ ఉత్పత్తి కూడా ప్రారంభం కాలేదు. వరద ప్రవాహం కొనసాగితే మరో నాలుగైదు రోజుల్లో గేట్లు ఎత్తే అవకాశం ఉంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com