హైదరాబాద్ 25°C
అమరావతి 29°C
IST 6:35 PM
శుక్రవారం జూలై 17 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
జాతీయం

ఓటరు జాబితాలో పేరు లేకపోతే పౌరసత్వం పోదు : సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య

రచన: ఉషా కిరణం డెస్క్ ·
ఓటరు జాబితాలో పేరు లేకపోతే పౌరసత్వం పోదు : సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య
📷 KATRIN BOLOVTSOVA / Pexels
షేర్ కాపీ అయింది ✓

ఓటరు జాబితాలో పేరు లేకపోవడం వల్ల ఒక వ్యక్తి పౌరసత్వం పోదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం ఎన్నికల కమిషన్కు లేదని తెలిపింది.

పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో SIR ప్రక్రియపై దాఖలైన పిటిషన్లను విచారించిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల కమిషన్కు ఓటరు జాబితా తయారీ, నిర్వహణ అధికారం మాత్రమే ఉందని, ఓటరు జాబితాలో పేరు తొలగించడం అంటే పౌరసత్వం రద్దు కాదని వివరించింది.

పశ్చిమ బెంగాల్‌లో ఓటరు జాబితాలో లేని వారికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు నిలిపివేసిన నేపథ్యంలో ఈ కేసు ప్రాధాన్యత సంతరించుకుంది. ఓటరు జాబితా ఆధారంగా పౌరులకు సంక్షేమ ప్రయోజనాలు నిరాకరించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టినట్లు తెలుస్తోంది.

ఈ కేసు తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఆగస్ట్ 25కి వాయిదా వేసింది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com