తమిళనాడులో విద్యార్థులకు ఫ్రీ ల్యాప్‌టాప్ పథకం.. ₹2,000 కోట్ల కేటాయింపు
తమిళనాడు ప్రభుత్వం కాలేజీ విద్యార్థులకు ఫ్రీ ల్యాప్‌టాప్‌లు ఇచ్చే కొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ పథకానికి బడ్జెట్‌లో ₹2,000 కోట్లు కేటాయించారు. 2026-27 బడ్జెట్‌లో ఈ స్కీమ్‌ను ప్రకటించినట్టు ముఖ్యమంత్రి విజయ్ తెలిపారు. అర్హత ఉన్న విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరంలో ఫస్ట్, సెకండ్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. పాలిటెక్నిక్, ఐటిఐ కోర్సులు చదివే విద్యార్థులకు కూడా ఈ అవకాశం ఉంది.
ప్రభుత్వ ఎయిడెడ్ కాలేజీల్లో ఆర్ట్స్, సైన్స్, ఇంజనీరింగ్, మెడిసిన్, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్, ఫిషరీస్, లా కోర్సులు చదివే వారు కూడా ల్యాప్‌టాప్‌లు పొందవచ్చు. 2025-26 అకాడమిక్ ఇయర్‌లో అడ్మిషన్ పొందిన విద్యార్థులు కూడా అర్హులే.
ఎంపికైన విద్యార్థులకు Core i5 లేదా దానికి సమానమైన వెర్షన్ ల్యాప్‌టాప్‌లు ఇస్తారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో హై-లెవల్ కమిటీ ఏర్పాటు కానుంది. పథకానికి సంబంధించిన పూర్తి విధివిధానాలు త్వరలో ప్రకటిస్తారు.
డిజిటల్ ప్రపంచంలో ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఎసెన్షియల్ టూల్ అని ప్రభుత్వం చెబుతోంది. దీని వల్ల విద్యార్థుల్లో టెక్నికల్ నాలెడ్జ్ పెరుగుతుందని ప్రభుత్వం పేర్కొంది. కొత్త స్కిల్స్ నేర్చుకుని భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలకు సిద్ధమవుతారని తెలిపింది. పూర్తి విధివిధానాలు ప్రకటించాక దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com