క్షయ రహిత తెలంగాణ లక్ష్యంగా 2,492 గ్రామాల్లో హెల్త్ స్క్రీనింగ్
క్షయ వ్యాధి నిర్మూలన లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం విస్తృత కార్యక్రమాలు చేపట్టిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కేంద్రానికి తెలిపారు.
రాష్ట్రంలోని 2,492 గ్రామాల్లో టీబీ నిర్ధారణకు హెల్త్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో టీబీ బాధితులకు పౌష్టికాహారం కోసం నెలకు రూ.1,000 ఇవ్వాలని సూచించారు.
దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ, తెలంగాణలో బాధితులకు ఫుడ్ బాస్కెట్లు అందిస్తున్నామని తెలిపారు. మాతా శిశు సంరక్షణ కార్యక్రమాల ద్వారా మాతృ మరణాలు, నవజాత శిశు మరణాలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆర్బీఎస్కే (RBSK) బృందాలు 18 ఏళ్ల లోపు పిల్లలకు హెల్త్ స్క్రీనింగ్ చేస్తున్నాయని, జన్యుపర రుగ్మతలను ముందుగా గుర్తించడానికి హెల్త్ చెకప్లు నిర్వహిస్తున్నట్లు మంత్రి వివరించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com