హైదరాబాద్ 26°C
అమరావతి 28°C
IST 10:24 AM
గురువారం నవంబర్ 5 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

తెలంగాణ క్యాబినెట్ భేటీ: రైతు భరోసా, కరువు సహాయంపై కీలక చర్చ

రచన: ఉషా కిరణం డెస్క్ ·
తెలంగాణ క్యాబినెట్ భేటీ: రైతు భరోసా, కరువు సహాయంపై కీలక చర్చ
📷 https://www.youtube.com/@mangonews / Wikimedia Commons / cc-by
షేర్ కాపీ అయింది ✓

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గురువారం సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీకి సంబంధించి ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఇప్పటికే నోటీసు జారీ చేశారు. క్యాబినెట్‌కు ముందు మధ్యాహ్నం 3 గంటలకు మంత్రులతో సీఎం ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

సమావేశంలో ప్రధానంగా యాసంగి రైతు భరోసాపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో భూగర్భ జలాలు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో యాసంగిలో వరి సాగు చేయవద్దని, నీటి వసతి ఉన్న చోట మాత్రమే ఆరుతడి పంటలు వేయాలని ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వానకాలంలో ఎకరాకు ₹6,000, యాసంగిలో ₹6,000 చొప్పున సంవత్సరానికి ₹12,000 లబ్ధిదారులకు అందిస్తోంది. సాగు తగ్గినందున ఈ నిధులను విడుదల చేయాలా, కరువు సహాయం రూపంలో ఇవ్వాలా అనే అంశంపై మంత్రివర్గం ఆలోచిస్తోంది.

రాష్ట్రంలో ఇప్పటికే 365 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. కేంద్రం నుంచి ₹20,000 కోట్ల ఆర్థిక సహాయం కోరినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఉపాధి హామీ పనులపైనా క్యాబినెట్‌లో చర్చ జరగనుంది. మంగళవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మందికి పైగా ఉపాధి హామీ పనులకు హాజరయ్యారు. ఈ పనులను మరింత పెంచేందుకు కేంద్రంతో చర్చలు జరపడంపైనా మంత్రివర్గం మాట్లాడనుంది.

అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లడంపైనా భేటీలో చర్చించనున్నారు. తాగునీరు, సాగునీరు అవసరాలు, కరువు మండలాలకు ఆర్థిక సహాయం, తుమ్మిడిహట్టి, మియాపూర్ భూములు, గ్లోబల్ సమ్మిట్ వంటి అంశాలు చర్చకు రానున్నాయి. మూడో శాసనసభ ఎనిమిదో సమావేశాన్ని అక్టోబర్ 31న ముగించుతూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆర్డినెన్సులు తీసుకొచ్చే అంశాలపైనా చర్చ ఉండవచ్చని సమాచారం.

రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం భూసేకరణ పరిహారంలో రాష్ట్ర వాటా కోసం తీసుకున్న రుణానికి సంబంధించిన ఫైల్ కూడా క్యాబినెట్ ముందుకు రానుంది. డిసెంబర్ 7, 8 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 ఏర్పాట్లపైనా సమీక్ష జరగనుంది. నిర్వహణ పనుల పురోగతి, ప్రచార కార్యక్రమాలపై అధికారుల నుంచి వివరాలు తీసుకోనున్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com