హైదరాబాద్ 31°C
అమరావతి 35°C
IST 2:25 PM
సోమవారం ఆగస్టు 3 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

గిగ్ వర్కర్లకు ప్రత్యేక ID కార్డు, సంక్షేమ బోర్డు: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
గిగ్ వర్కర్లకు ప్రత్యేక ID కార్డు, సంక్షేమ బోర్డు: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
📷 https://www.youtube.com/@mangonews / Wikimedia Commons / cc-by
షేర్ కాపీ అయింది ✓

తెలంగాణ రాష్ట్రంలో గిగ్ వర్కర్ల కోసం ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. త్వరలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయనుండగా, సంక్షేమ బోర్డు సేవలు ఈ నెల 15న ప్రారంభం కానున్నాయి.

తెలంగాణ ప్లాట్‌ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్ల చట్టం 2026 కింద ఈ చర్యలు చేపడుతున్నారు. డెలివరీ బాయ్‌లు, క్యాబ్ డ్రైవర్లు, లాజిస్టిక్స్ సిబ్బంది వంటి దాదాపు 5 లక్షల మంది గిగ్ వర్కర్లకు ఈ నిర్ణయం ప్రయోజనం కలిగించనుంది. కార్మిక శాఖ ఈ ప్రక్రియను వేగవంతం చేసింది. సీఎం రేవంత్ రెడ్డికి ఈ విషయంపై నివేదిక అందించారు.

గిగ్ వర్కర్లు ఎదుర్కొంటున్న ఆకస్మిక వేతన కోతలు, యాప్ల ఆల్గరిథమ్స్ ఆధారిత ఆంక్షలకు చెక్ పెట్టేందుకు కఠిన నిబంధనలు రూపొందించారు. యాప్లు అనవసరంగా పేమెంట్లు నిలిపివేయడం, ఐడిలు బ్లాక్ చేయడం, కారణం లేని కోతలు విధించడం వంటి చర్యలు నిలిపివేయాలని, సంస్థలు పూర్తి పారదర్శకత పాటించాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే అగ్రిగేటర్ సంస్థలకు మొదటి తప్పుగా రూ.50,000 వరకు జరిమానా, పునరావృతమైతే బకాయిలపై ఐదు రెట్ల వరకు భారీ పెనాల్టీ విధించనున్నారు.

స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్ వంటి అగ్రిగేటర్ సంస్థలు ప్రతి లావాదేవీపై 1-2% వెల్ఫేర్ ఫీజు సేకరించి సంక్షేమ బోర్డుకు జమ చేయాలి. ఈ నిధులతో కార్మికుల ఇన్సూరెన్స్ ప్రీమియంలు, ఆర్థిక భరోసా, కుటుంబ సభ్యుల ఆరోగ్య పథకాలు వంటి సంక్షేమ చర్యలు నిరంతరం అమలు చేస్తారు. నిధుల సేకరణను సులభతరం చేసే పటిష్టమైన కలెక్షన్ మెకానిజం రూపొందిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com