హైదరాబాద్ 26°C
అమరావతి 30°C
IST 7:31 PM
మంగళవారం ఆగస్టు 4 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

తెలంగాణ ప్రభుత్వం జర్మనీ, జపాన్‌లలో 5 లక్షల ఉద్యోగాల ఒప్పందం; కేటీఆర్ విమర్శలపై మంత్రి వివేక్ వెంకటస్వామి కౌంటర్

రచన: ఉషా కిరణం డెస్క్ ·
తెలంగాణ ప్రభుత్వం జర్మనీ, జపాన్‌లలో 5 లక్షల ఉద్యోగాల ఒప్పందం; కేటీఆర్ విమర్శలపై మంత్రి వివేక్ వెంకటస్వామి కౌంటర్
📷 112 Uttar Pradesh / Pexels
షేర్ కాపీ అయింది ✓

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం జర్మనీ, జపాన్ దేశాలతో 5 లక్షల ఉద్యోగాల కల్పనకు ఒప్పందం కుదుర్చుకుందని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఈ మేరకు యువతకు జర్మన్ భాష నేర్పించి ఉద్యోగాలు కల్పించేందుకు ఏటీసీ సెంటర్లు, పాలిటెక్నిక్ స్కిల్ యూనివర్సిటీ ద్వారా అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం కేంద్రంలో మంత్రి వివేక్ పలు అభివృద్ధి పనులకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి ₹42 కోట్లతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ నిర్మాణం ప్రారంభించారు. అలాగే ₹40 లక్షలతో CC రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

జర్మన్ భాష అభ్యసనపై బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ చేసిన విమర్శలను మంత్రి ఖండించారు. 'ఎక్కడ పనిచేస్తున్నామో అక్కడి భాష నేర్చుకుంటే తప్పేముంది? ఆయన అమెరికా వెళ్లాలనుకున్నప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోలేదా? మన పిల్లలు నాలుగు నెలలు రోజుకు రెండు గంటలు జర్మన్ నేర్చుకుంటే ₹20 లక్షల వరకు జీతం వచ్చే ఉద్యోగాలు పొందుతారు' అని ఆయన అన్నారు.

'కేటీఆర్ హయాంలో ఉద్యోగాలు కల్పించలేదు. అందుకే ప్రజలు ఓడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే లక్ష ఉద్యోగాలు ఇచ్చింది, మరో లక్ష ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాలపై ప్రజల్ని రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని కేటీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నా' అని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com