తెలంగాణలో నేటి నుంచి మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం
తెలంగాణ ప్రభుత్వం నేటి నుంచి మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం ప్రారంభిస్తోంది. అధికారులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
దరఖాస్తుదారుల నమోదుతో పాటు రిజిస్ట్రేషన్ నంబర్ కూడా ఫిర్యాదుదారులకు ఇస్తారు. మండల స్థాయి అధికారులు, ఎస్ఐలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశించింది. స్వీకరించిన వినతి పత్రాలను వెంటనే పరిష్కరించాలని సూచించింది.
ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లలో జరిగే ప్రజావాణిలో మండల స్థాయి నుంచి 70 శాతం ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో మండలాల్లోనే ప్రజావాణి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com