హైదరాబాద్ 25°C
అమరావతి 29°C
IST 8:39 AM
శుక్రవారం ఆగస్టు 7 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

ప్రాజెక్టులు నిండితేనే సాగునీరు: నీటి యాజమాన్య కమిటీ నిర్ణయం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
ప్రాజెక్టులు నిండితేనే సాగునీరు: నీటి యాజమాన్య కమిటీ నిర్ణయం
📷 prasun_16 . / Pexels
షేర్ కాపీ అయింది ✓

హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగిన రాష్ట్ర స్థాయి సమీకృత నీటి ప్రణాళిక యాజమాన్య కమిటీ సమావేశంలో ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండిన తర్వాతే ఆయకట్టుకు సాగునీటిని అందించాలని నిర్ణయించారు. ఇంజనీర్ ఇన్చీఫ్ రమేశ్‌బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.

భారత వాతావరణ శాఖ ఎల్‌నినో కారణంగా ఈ ఏడాది లోటు వర్షపాతం నమోదవుతుందని, సెప్టెంబర్ నెలలో ఒకటి రెండు మినహా వర్షాలు కురిసే అవకాశం లేదని హెచ్చరించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం ప్రాజెక్టుల్లో ఉన్న స్వల్ప నీటిని వాడితే తదుపరి తీవ్ర నీటి కొరత ఏర్పడుతుందని అధికారులు ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా వచ్చే జూలై వరకు తాగునీటి అవసరాలు, జంతుజాలాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.

ఆదిలాబాద్, నిజామాబాద్ సర్కిళ్లలో శ్రీరామసాగర్ మినహా ఇతర ప్రాజెక్టులకు ఇటీవల కొంత ప్రవాహం వచ్చింది. అయితే రాష్ట్రంలోని గోదావరి, కృష్ణా పరివాహక ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు కేవలం 44.45 టీఎంసీలు మాత్రమే కాగా, అవసరం 336.78 టీఎంసీలు. 29.75 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఇంజనీర్లు ప్రతిపాదనలు సిద్ధం చేసినా నీటి కొరతతో సాగు సాధ్యంకాదని భావిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన సాగు వివరాలు సేకరించి 15 రోజుల్లో మరోసారి సమావేశం కావాలని కూడా కమిటీ నిర్ణయించింది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com