యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం వేగవంతం: 105 నియోజకవర్గాలకు విస్తరణ
తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణాన్ని వేగవంతం చేసింది. వచ్చే విద్యా సంవత్సరం లోపు పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
CM రేవంత్ రెడ్డి అన్ని కులాల విద్యార్థులు ఒకే చోట చదువుకునే ఆలోచనతో ఈ పాఠశాలల వ్యవస్థను ప్రారంభించారు. 105 నియోజకవర్గాల్లో ఆధునిక విద్యా ప్రాంగణాలు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే 144.85 కోట్ల రూపాయల నిధులు విడుదలైంది.
వివిధ దశల్లో 86 పాఠశాలల నిర్మాణం కొనసాగుతోంది. 19 పాఠశాలలకు పరిపాలన అనుమతులు తుది దశలో ఉన్నాయి. ఆదిలాబాద్, గజ్వేల్ నియోజకవర్గాల్లో టెండర్లు పూర్తయి పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ముతోల్, బోద్, నిర్మల్ జిల్లాల్లో టెండర్ల పరిశీలన కొనసాగుతుంది. సిర్పూర్, కామారెడ్డి, దుబ్బాక ప్రాంతాల్లో స్థలాలు కేటాయించగా, డిపిఆర్లు రూపొందిస్తున్నారు.
ఒక్కో స్కూల్ సుమారు 25-30 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. అందులో అంతర్జాతీయ స్థాయి క్రీడా మైదానాలు, డైనింగ్ బ్లాక్లు, సిబ్బంది నివాసాలు ఉంటాయి. 2,650 మంది విద్యార్థులకు వసతి కల్పించేలా రూపకల్పన చేశారు. మొత్తం నిర్మాణ విస్తీర్ణం 5.36 లక్షల చదరపు అడుగులకు చేరుతుంది.
కోరుట్ల, జనగామ, హుజూరాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, అలంపూర్, సిద్దిపేట, నరసాపూర్, సంగారెడ్డి, జహీరాబాద్, ఎల్బి నగర్, మహేశ్వరం, సూర్యాపేట, ఉప్పల్, బాల్కొండ, నిజామాబాద్, కూకట్పల్లి, మల్కాజగిరి, కుత్బుల్లాపూర్ తదితర నియోజకవర్గాల్లో ఏర్పాటు కానున్న స్కూళ్ల అంచనాలు ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. ఈ పాఠశాలలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి రానున్నాయి.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com