సూర్యాపేట జిల్లాలో మూడు బస్సులు ఢీకొని 10 మందికి గాయాలు
సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల గ్రామం వద్ద మూడు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, ఒక RTC బస్సు ఒకదానికొకటి ఢీకొన్నాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదం కారణంగా హైదరాబాద్-విజయవాడ హైవేపై 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ట్రాఫిక్ క్లియర్ చేశారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com