శేషాచల అటవీ ప్రాంతంలో తొలిసారిగా పెద్దపులి సంచారం ట్రాప్ కెమెరాలో నమోదు
తిరుపతి జిల్లాలోని శేషాచల అటవీ ప్రాంతంలో తొలిసారిగా పెద్దపులి సంచారం ట్రాప్ కెమెరాలో నమోదైంది. వెంకటగిరి రేంజ్ పరిధిలో అధికారులు ఈ పులి కదలికలను గుర్తించారు.
ఎర్రచందనం సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో పులి నమోదైనట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు. నల్లమల అటవీ ప్రాంతం నుంచి లంకమల మీదుగా పులి శేషాచలంలోకి వచ్చి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
గతంలో తలకోన రేంజ్‌లో పులి సంచరిస్తున్నట్టు ప్రచారం జరిగింది. కానీ దానికి ఆధారాలు లభించలేదు. ఇప్పుడు తొలిసారిగా ట్రాప్ కెమెరాలో ఆధారం లభించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శేషాచల ప్రాంతంలో 38 చిరుతలు ఉన్నట్టు గతంలో నిర్ధారించారు.
వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇతర జంతువులకు ఇబ్బంది లేకుండా పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com