ఆధ్యాత్మికం

తిరుమలలో భారీ రద్దీ: అభిషేక సేవ సమయంలో సామాన్య భక్తులకు దర్శనం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
తిరుమలలో భారీ రద్దీ: అభిషేక సేవ సమయంలో సామాన్య భక్తులకు దర్శనం
📷 Ravi Kant / Pexels
షేర్ కాపీ అయింది ✓

తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. నిన్న 79,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.

భక్తుల సంఖ్య పెరగడంతో TTD అదనపు ఈవో వెంకయ్య చౌదరి కీలక నిర్ణయం తీసుకున్నారు. అభిషేక సేవ సమయంలో సామాన్య భక్తులకు దర్శనం కల్పించారు. ఈరోజు ఉదయం అభిషేక సేవ సమయంలో 5,850 మంది భక్తులకు దర్శన భాగ్యం కలిగింది.

వైకుంఠం queue complex లోని 31 compartments పూర్తిగా నిండిపోయాయి. నారాయణగిరి ఉద్యానవనంలో 9 compartments నిండిపోయాయి. ఆల్వా ట్యాంక్ చుట్టూ ఉన్న queue లైన్లు, కృష్ణతేజ అతిథి గృహం నుంచి బాటగంగమ్మ ఆలయం వరకు భక్తులు వేచి ఉన్నారు.

ప్రస్తుతం పాచికాలగంగమ్మ ఆలయ ప్రాంతం నుంచి కూడా భక్తులను queue లోకి అనుమతిస్తున్నారు. లక్ష మంది పైగా సర్వదర్శనం భక్తులు queue లో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 24 నుంచి 30 గంటల పైగా సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

తిరుమలలో 7,000 వసతి గదులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. భక్తుల సంఖ్య అంతకు మించి ఉండటంతో వసతి కొరత నెలకొంది. TTD యాత్రికుల వసతి సముదాయాల వైపు మళ్లించినప్పటికీ కొందరు భక్తులు రోడ్లపై రాత్రి గడిపే పరిస్థితి ఉంది.

పరీక్ష ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో మొక్కులు చెల్లించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తున్నారని TTD వర్గాలు తెలిపాయి.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com