హైదరాబాద్ 24°C
అమరావతి 29°C
IST 6:42 PM
బుధవారం జూలై 29 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

30% వర్షపాతం లోటు: వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని మంత్రి తుమ్మల సూచన

రచన: ఉషా కిరణం డెస్క్ ·
30% వర్షపాతం లోటు: వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని మంత్రి తుమ్మల సూచన
📷 Hrishav Jha / Pexels
షేర్ కాపీ అయింది ✓

తెలంగాణలో ఇప్పటివరకు నైరుతి రుతుపవనాల వర్షపాతం 30% లోటుగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులు తొందరపడి వరి నాట్లు వేయొద్దని, బదులుగా ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేయాలని ఆయన సూచించారు.

హైదరాబాద్ గాంధీ భవన్‌లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.

ఎల్నినో ప్రభావం వచ్చే రెండు నెలల పాటు కొనసాగుతుందని, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఈ ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారని మంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలో రైతులు పంట మార్పిడి చేపట్టి చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, హార్టికల్చర్ పంటలు సాగు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయిల్ ఫామ్ సాగు పట్ల రైతులు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వ్యవసాయ, నీటిపారుదల, భూగర్భ జలాలు, పశు సంవర్ధక శాఖలు సమన్వయంతో ప్రతి వారం రైతులను చైతన్యపరుస్తున్నాయని మంత్రి వివరించారు. గత 150 ఏళ్లలో ఎన్నడూ చూడని ప్రకృతి వైపరీత్యాన్ని తట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com