తుంగభద్ర డ్యాంకు 50 ఏళ్ల పాటు ఢోకా లేదు: ఇంజినీరింగ్ నిపుణుడు కన్నయ్య నాయుడు
తుంగభద్ర జలాశయంలో బిగించిన కొత్త క్రస్ట్ గేట్లతో 50 ఏళ్ల పాటు ప్రాజెక్ట్‌కు ఎలాంటి ఢోకా లేదని జలాశయాల ఇంజినీరింగ్ నిపుణుడు కన్నయ్య నాయుడు తెలిపారు. డ్యామ్‌కు ఎంత వరద వచ్చినా ఇకపై ఇబ్బంది ఉండదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
2024 ఆగస్టు 10న తుంగభద్ర డ్యాం గేట్ నంబర్ 19 లింక్ పోయి కొట్టుకుపోయిన ఘటన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో తన అనుభవంతో అప్పటికప్పుడు డిజైన్ రూపొందించి సెంట్రల్ వాటర్ కమిషన్, కర్ణాటక ప్రభుత్వం, తుంగభద్ర బోర్డ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు సలహాలు పంపినట్లు కన్నయ్య నాయుడు వివరించారు.
తర్వాత కేంద్ర ప్రభుత్వ నిపుణుల బృందం పాత గేట్లను పరిశీలించి, వాటిని రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదని భావించింది. కానీ అల్ట్రాసోనిక్ సౌండ్ టెస్టింగ్ ద్వారా గేట్లను స్కాన్ చేయగా, 75 శాతం మెటల్ తినేసినట్లు తేలింది. దీంతో గేట్ల మార్పిడికి నిర్ణయం తీసుకున్నారు.
కొత్త గేట్ల రూపకల్పన సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్ ప్రకారం జరిగింది. అయితే పాత డ్యామ్‌లో సివిల్ వర్క్‌కు సరిపోయేలా కొలతలు అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది. డ్యామ్ వంతెన గరిష్టంగా 30 టన్నుల సామర్థ్యం మాత్రమే కలిగి ఉండటంతో, నాన్ ప్యానెల్ యాక్షన్ లో డిజైన్ మార్పు చేసి ఆ పరిమితిలో నే గేట్లను తయారు చేయించారు.
గేట్ల ఫాబ్రికేషన్, వెల్డింగ్ నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని, మెకానికల్ సీల్స్‌ను బలోపేతం చేయడం వల్ల ఇంకో 50 ఏళ్ల పాటు గ్యారంటీ ఇవ్వగలమని కన్నయ్య నాయుడు స్పష్టం చేశారు. ఈ గేట్లు కొత్తగా బిగించడంతో తుంగభద్ర జలాశయం భవిష్యత్తు వరదలకు ఎదురుతగలగుతుందని ఆయన ధీమాగా ఉన్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com