హైదరాబాద్ 33°C
అమరావతి 37°C
IST 3:18 PM
బుధవారం జూలై 8 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

కరీంనగర్: లింగాపూర్లో రెండు ఆలయాల్లో చోరీ; హుండీలు, బంగారు ఆభరణాలు దొంగిలింపు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
కరీంనగర్: లింగాపూర్లో రెండు ఆలయాల్లో చోరీ; హుండీలు, బంగారు ఆభరణాలు దొంగిలింపు
📷 Monstera Production / Pexels
షేర్ కాపీ అయింది ✓

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం లింగాపూర్లోని ఎల్లమ్మ దేవి, పెద్దమ్మ దేవి ఆలయాల్లో గుర్తుతెలియని దొంగలు చోరీలకు పాల్పడ్డారు.

దుండగులు రెండు ఆలయాల్లోని హుండీలను పగలగొట్టి అందులో ఉన్న నగదును ఎత్తుకెళ్లారు. అలాగే అమ్మవారి విగ్రహాలపై ఉన్న బంగారు పుస్తెలు, మెట్టియలు, ముక్కుపుడక వంటి ఆభరణాలను కూడా దొంగిలించారు.

ఆలయ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శంకరపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఆలయ నిర్వాహకుడు మాట్లాడుతూ, ఎల్లమ్మ గుడిలో గతంలోనూ మూడు సార్లు చోరీలు జరిగాయని, అప్పుడు నగదు, బంగారం దొంగలించారని తెలిపారు. నెల క్రితం బోనాల సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకల పెట్టెను కూడా దొంగలు పగలగొట్టి డబ్బులు తీసుకెళ్లినట్టు చెప్పారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించినట్టు వివరించారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com